తరతరాలుగా తమ కుటుంబంతో అనుబంధం పెంచుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను మేము ప్రేరేపిస్తాము.

FamilySearch కార్యాలయం, లీహై, యూటా, యు.ఎస్.ఎ
అందరికీ ఉచితం
యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము, సంప్రదాయం, సంస్కృతి లేదా మతపరమైన అనుబంధంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ FamilySearchను ఉచితంగా అందిస్తుంది. FamilySearch వనరులు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి వారి వారసత్వాన్ని కనుగొనడానికి మరియు కుటుంబ సభ్యులతో అనుసంధానం కావడానికి సహాయపడతాయి.
FamilySearchతో సంఘానికి ఉన్న అనుబంధం గురించి మరిన్ని వివరాలు
మేము ఏమి చేస్తాము
మా వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 5,000కు పైగా స్థానిక కుటుంబ చరిత్ర కేంద్రాల్లో ప్రత్యక్షంగా అందించే సహాయం ద్వారా ప్రజలు తమ కుటుంబ చరిత్రను తెలుసుకోవడానికి మేము సహాయపడతాము.

ప్రపంచవ్యాప్త సహకారం
స్థానిక చట్టాలకు లోబడి, ముఖ్యమైన కుటుంబ రికార్డులను భద్రపరచి, వాటిని ఆన్‌లైన్‌లో అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంచడానికి FamilySearch కట్టుబడి ఉంది. మా సేవలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. 100కు పైగా దేశాల్లో 10,000కు పైగా సంస్థలతో కలిసి మేము పనిచేశాము. FamilySearch ఎల్లప్పుడూ స్థానిక చట్టాలకు అనుగుణంగా పనిచేయడానికి కట్టుబడి ఉంటుంది.


















