వాటిని కోల్పోయే ముందే మీ పాత కుటుంబ చిత్రాలను భద్రపరచండి
ప్రతి ఒక్కరి వద్ద డ్రాయర్‌లలో, సేకరణ పుస్తకములలో మరియు అటకలలో పాత కుటుంబ చిత్రాలు మరుగున పడి ఉంటాయి. మీ పూర్వీకుల చిత్రాలు, కథలు మరియు పత్రాలను భద్రపరచడం, నిర్వహించడం మరియు పంచుకోవడాన్ని FamilySearch సులభతరం చేస్తుంది, తద్వారా ఎన్నో తరాలు వాటిని ఆస్వాదించగలవు.
ఇది ఎలా పని చేస్తుంది
కేవలం కొన్ని దశల్లో పాత కుటుంబ చిత్రాలను భద్రపరచిన కుటుంబ జ్ఞాపకాలుగా మార్చండి.
పాత కుటుంబ చిత్రాన్ని అప్‌లోడ్ చేయండి
ఏదైనా పాత కుటుంబ చిత్రం మసకబారినా, చిరిగిపోయినా లేదా పాత సేకరణ పుస్తకములో ఉండిపోయినా, దాని చిత్రం తీయండి లేదా స్కాన్ చేయండి.
పేర్లు మరియు వివరాలను జోడించండి
చిత్రంలోని వ్యక్తులను ట్యాగ్ చేయండి, తేదీలు, ప్రదేశాలు మరియు కథలను జోడించండి, అలా చిత్రాన్ని సరైన పూర్వీకునికి అనుసంధానించండి.
దానిని మీ కుటుంబంతో పంచుకోండి
ఒకసారి మీ చిత్రం అప్‌లోడ్ అయిన తర్వాత, బంధువులు దానిని కనుగొనవచ్చు, దానిని ఆస్వాదించవచ్చు, మీరు పంచుకున్న కుటుంబ కథకు మరింత సమాచారాన్ని జోడించవచ్చు.

కేవలం చిత్రాల కంటే ఎక్కువ
చిత్రాలను మించి భద్రపరచడానికి FamilySearch జ్ఞాపకాలు మీకు సహాయపడుతుంది. మీ కుటుంబ చరిత్రకు జీవం పొసే కథలు, రికార్డులు మరియు స్వరాలను కూడా మీరు జోడించవచ్చు.
చిత్రాలు
మీ కుటుంబం మరియు పూర్వీకుల చిత్రాలను అప్‌లోడ్ చేయండి, అవి స్కాన్ చేసినవి అయినా, చిత్రం తీసినవి అయినా లేదా ఇప్పటికే డిజిటల్‌గా ఉన్నవి అయినా సరే.
పత్రాలు
స్కాన్ చేసిన లేఖలు, జర్నల్‌లు, ధృవపత్రాలు, వంటకాల వివరాలు, సైనిక పత్రాలు మరియు ఇతర కుటుంబ రికార్డులను భద్రపరచండి.
కథలు
మీ పూర్వీకులు ఎవరు, వారికి ఏవి ముఖ్యమైనవి అని వివరించే కుటుంబ కథలు, జ్ఞాపకాలు మరియు వివరాలను టైప్ చేయండి.
ఆడియోలు
తల్లిదండ్రులు, తాతలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు, బంధువులు వారి స్వంత మాటల్లో వారి కథలను చెప్పే వారి స్వరాలను రికార్డు చేయండి లేదా అప్‌లోడ్ చేయండి.
సేకరణ పుస్తకములు
సంబంధిత జ్ఞాపకాల సేకరణల కోసం సేకరణ పుస్తకములను ఉపయోగించండి.
ఈరోజే ప్రారంభించండి
మీ విలువైన జ్ఞాపకాలను భద్రపరచడానికి మరియు పంచుకోవడానికి ఈ శక్తివంతమైన ఫీచర్‌లను ఉపయోగించండి.
FamilySearch జ్ఞాపకాలు ఎందుకు ఎంచుకోవాలి?
అనేక యాప్‌లు చిత్రాలను నిల్వ చేయగలవు. FamilySearch జ్ఞాపకాలు కుటుంబ చరిత్రను ఇతర సేవలు చేయలేని విధంగా భద్రపరచడానికి రూపొందించబడింది.
ఉచితం మరియు భవిష్యత్ తరాల కోసం భద్రపరచబడింది
మీ కుటుంబం ఎక్కడ నివసించిందనే దాని గురించి ముఖ్యమైన వివరాలను చారిత్రక రికార్డులు తరచుగా వెల్లడించగలవు.
ప్రజలు మరియు కథల చుట్టూ నిర్వహించబడింది
సాధారణ చిత్రాల యాప్‌లా కాకుండా, FamilySearch చిత్రాలను, పత్రాలను, కథలను మరియు ఆడియోను నేరుగా మీ వంశవృక్షంలోని వ్యక్తులకు అనుసంధానిస్తుంది.
పంచుకోబడుతున్న వంశవృక్షానికి అనుసంధానించబడింది
దూరపు బంధువు ఒకరు ఇప్పటికే మీ పూర్వీకుడికి సంబంధించిన చిత్రాన్ని, కథను లేదా రికార్డును అప్‌లోడ్ చేసి ఉండవచ్చు.
సురక్షితమైనది మరియు కుటుంబానికి స్నేహపూర్వకమైనది
FamilySearch గౌరవప్రదమైన విషయ ప్రమాణాలను ఉపయోగిస్తుంది మరియు జీవించియున్న వ్యక్తులకు సంబంధించిన జ్ఞాపకాలను గోప్యంగా ఉంచుతుంది.
నియంత్రణ మీతో ఉంటుంది
ఒక జ్ఞాపకం బహిరంగమైనదిగా ఉండాలా, గోప్యమైనదిగా ఉండాలా లేదా ఒక సమూహంతో పంచుకోవచ్చా అనేది ఎంచుకోండి. FamilySearch మీ డేటాను విక్రయించదు.
తరచుగా అడుగబడే ప్రశ్నలు
మీ పాత కుటుంబ చిత్రాలను మరుగున పడనివ్వకండి!
మీ చిత్రాల వెనుక ఉన్న కథలు ముఖ్యమైనవి! మీ కుటుంబం ఎన్నో తరాలు ఆస్వాదించగలిగేలా వాటిని ఇప్పుడే భద్రపరచండి.