వంశవృక్షాన్ని సృష్టించండి
FamilySearchలో మీ వంశవృక్షం యొక్క శాఖలను నమోదు చేయడం ప్రారంభించడానికి ఈ కార్యకలాపాలను ప్రయత్నించండి.
వృక్షం అంటే ఏమిటి?
ఇది కుటుంబ వంశావళుల యొక్క విస్తరిస్తున్నసేకరణ. ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా తమ శాఖలను జోడించారు.
ప్రారంభ దశలు
మీ తల్లిదండ్రులతో మొ��లుపెట్టి, మీకు వీలైనంత వరకు జీవించి ఉన్న మరియు మరణించిన బంధువులను చేర్చండి. వయసులో పెద్దవారైన మీ బంధువులకు ఒక చిన్న ఫోన్ కాల్ చేయడం లేదా సందేశం పంపడం, మీకు తెలియని కొన్ని విషయాలను తెలుసుకోవడానికి సహాయపడవచ్చు.
చిట్కా: మరణించిన వారి వివరాల వైపు వెళ్లే క్రమంలో, జీవించి ఉన్న వ్యక్తుల వివరాలను జోడించడం గురించి ఆందోళన చెందకండి. జీవించి ఉన్న వ్యక్తులకు సంబంధించిన సమాచారమంతా గోప్యంగా ఉంచబడుతుంది.
వృక్షానికి వ్యక్తులను జోడించడం
వృక్షానికి ఒక వ్యక్తిని జోడించడానికి (+) మీటను ఎంచుకోండి.
ఆ వ్యక్తి పేరుతో పాటు, పుట్టిన లేదా మరణించిన తేదీలు మరియు ప్రదేశాలను కూడా చేర్చండి. మీకు తెలిసిన లేదా మీరు తెలుసుకోగలిగే విషయాలు ఏవైనా సరే. ఆపై 'తదుపరి'ని ఎంచుకోండి.
సామాజిక వంశవృక్షానికి అనుసంధానింపబడండి
మీరు వంశవృక్షానికి పేర్లను జోడిస్తున్న కొద్దీ, మేము వాటికి సరిపోయే పోలికల కోసం వెతుకుతాము. కాబట్టి, మరణించిన మీ అమ్మమ్మ లేదా నానమ్మ ఇప్పటికే ఆ వంశవృక్షంలో ఉంటే, మేము ఆమెను గుర్తించి ఆ అనుసంధానాన్ని ఏర్పాటు చేస్తాము. సరిపోలే అంశాలను కనుగొనడం సాధారణం—ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు అనేక సంవత్సరాలుగా అందించిన సమాచారంతోనే ఈ సామాజిక వంశవృక్షం రూపొందించబడింది.
రికార్డు సూచనల కోసం గమనించండి
వంశవృక్షంలో పూర్వీకుల సరిపోలికల కోసం వెతకడంతో పాటు, మీరు జోడించే మరణించిన పూర్వీకుల వివరాల కోసం మా చారిత్రక రికార్డుల సేకరణలో కూడా మేము వెతుకుతాము. ఏదైనా సరిపోలికను కనుగొన్నప్పుడు, మేము మీకు ఒక "సూచన"ను చూపిస్తాము. అక్కడ కనిపించే నీలం రంగు చిహ్నం ద్వారా మీరు సూచనను గుర్తించవచ్చు.
వంశవృక్షానికి వెళ్లి ప్రారంభించడానికి ఆ లింక్‌ను అనుసరించండి. మీకు ఏవైనా ప్రశ్నలు ఉన్నా లేదా ఇది ఎలా పనిచేస్తుందో మరింత తెలుసుకోవాలనుకున్నా, పేజీ పైభాగంలో ఉన్న (?) చిహ్నంపై క్లిక్ చేయండి.
చిట్కా: సూచనలు సరిపోలుతున్నాయో లేదో తెలుసుకోవడానికి వాటిని పరిశీలించండి. సరిపోలితే, వంశవృక్షానికి కొత్త శాఖలను జోడించడానికి ఇది ఒక గొప్ప మార్గం.