పాలుపంచుకోండి

పాలుపంచుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులకు మేలు చేసేందుకు ఈ కార్యకలాపాన్ని ప్రయత్నించండి.

సూచికీకరణ అంటే ఏమిటి?

సూచికీకరణ అనేది ఒక స్వచ్ఛంద ప్రాజెక్ట్; ఇది జనాభా గణన వివరాలు లేదా మరణ వార్తల వంటి చారిత్రక రికార్డుల చిత్రాలను ఆన్‌లైన్‌లో వెతికే వీలు కల్పిస్తుంది. వంశావళి సమాజానికి తిరిగి ఏదైనా అందించడానికి మరియు కుటుంబ ఆవిష్కరణలను సాధ్యం చేయడానికి ఇది ఒక గొప్ప మార్గం.

ఇది ఎలా పనిచేస్తుందంటే

సూచిక లేని చారిత్రక రికార్డు యొక్క చిత్రం శోధనలో కనిపించదు. దాన్ని కనుగొనడానికి దానికి సంబంధించి ఎలాంటి కీలక పదాలు జత చేయబడి ఉండవు.

ఒక స్వచ్ఛంద సూచీకారుడు సూచికీకరణ ప్రోగ్రామ్‌లోని రికార్డును చూసి, పేర్లు, తేదీలు మరియు ప్రదేశాల వంటి ముఖ్యమైన సమాచారాన్ని టైప్ చేస్తారు. ఫలితంగా వచ్చిన సూచికీకరణ చేయబడిన చిత్రం, FamilySearch లో ఉచితంగా లభించే శోధించదగిన రికార్డులకు జోడించబడుతుంది.

సూచికీకరణ అనేది యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము చేత అందించబడిన సేవలలో ఒకటైన FamilySearch ద్వారా సమర్పించబడి, ఆతిథ్యము వహించబడుతుంది.

దీన్ని ప్రయత్నించండి

FamilySearchలో సైన్ ఇన్ చేయడానికి సూచికీకరణ హోమ్‌పేజీకి వెళ్ళండి మరియు సూచికీకరణ చేయడానికి ఒక చిత్రాల "సముదాయము"ను ఎంచుకోండి. అనేక విభిన్న భాషలలో ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయి. మీకు ఎంత సమయం ఉంటే అంత సమయం వెచ్చించండి. ప్రశ్నలకు సమాధానమివ్వడానికి సిస్టమ్‌లో సహాయక వనరులు పొందుపరచబడ్డాయి.